మందమర్రిలో జేఏసీ యాత్ర విజయవంతం - Mandamarri News Hub - Breaking News | Latest News | Express News

Hot

Post Top Ad

Wednesday, 4 October 2017

మందమర్రిలో జేఏసీ యాత్ర విజయవంతం

☆మందమర్రిలో  తెలంగాణ  అమరుల స్ఫూర్తి యాత్ర విజయవంతం.....
☆భారి బైక్ ర్యాలీ చేపట్టిన తెలంగాణ వాదులు
(మందమర్రి ఎక్స్ ప్రెస్ న్యూస్ )    తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చేపట్టిన అమరుల స్ఫూర్తి యాత్ర  మందమర్రిలో విజయవంతమైంది తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం కు మందమర్రి యపల్ లో తెలంగాణ వాదులు అఖిలపక్షం నాయకులు జేఏసీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు మందమర్రి యపల్ నుండి పాత బస్టాండ్ మార్కెట్ వరకు  200 బైకులతో భారి ర్యాలీ చేపట్టారు పాత బస్టాండ్ లో జయశంకర్ విగ్రహనికి మరియు  మందమర్రి మార్కెట్ లోని అంబేద్కర్  విగ్రహనికి పూల మాలలు వేశారు  మందమర్రి మార్కెట్ లో జేఏసీ చైర్మన్ కోదండరాం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు ఆయన మాట్లాడుతూ  తెలంగాణలో సింగరేణి  ఓపెన్ కాస్టులతో  బోందలగడ్డ గా మారుస్తున్నరని  భూగర్భ గనులను ఏర్పాటు చేయలని డిమాండ్ చేశారు  సింగరేణి వారసత్వ ఉద్యోగాలను కల్పించాలని డిమాండ్ చేశారు  తెలంగాణ  ఈ ర్యాలీలో సింగరేణి డిపేండేంట్ వారసులు  అధిక సంఖ్యలో పాల్గొన్నారు  మార్కెట్ నుండి యాత్ర  రామక్రిష్ణపుర్ కు సాగింది  ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యవంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గురిజాల రవిందర్  జేఏసీ  జిల్లా  అధ్యక్షుడు  బాపన్న జిల్లా కన్వీనర్ పోడేటి సంజీవ్  విఆర్ఎస్ జేఏసీ నాయకులు రమణ  డిస్మిస్ సంఘం ప్రభాకర్ ఓసి వ్యతిరేక కమిటీ నాయకులు బుచ్చన్న  విద్యార్ధి జేఏసీ నాయకులు కస్తూరి శ్రీనాధ్ చారి గడ్డం వేంకటేష్ తెలంగాణ  జేఏసీ సోషల్ మిడియ జిల్లా కన్వీనర్ గుడికందుల రమేష్   తదితరులు  పాల్గొన్నారు అఖిలపక్షం నుండి  తెలుగుదేశం పార్టీ చెన్నూరు నియోజకవర్గ ఇంచార్జి దుర్గం నరేష్  జిల్లా అధ్యక్షుడు బోడ జనార్ధన్ తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి సంజయ్ కుమార్ పట్టణ అధ్యక్షుడు పైడిమల్ల నర్సింగ్ యువజన కాంగ్రెస్ నాయకులు గుడ్ల రమేష్ నూకల రమేష్  ఎస్సి సెల్ జిల్లా అధ్యక్షుడు సంగి సంతోష్ సిపిఐ సిపిఎం నాయకులతో తో పాటు ఆయ పార్టీ శ్రేణులు  అధిక సంఖ్యలో పాల్గొన్నారు

1 comment:

Post Top Ad