Mandamarri News Hub - Breaking News | Latest News | Express News: bigboss

Hot

Post Top Ad

Showing posts with label bigboss. Show all posts
Showing posts with label bigboss. Show all posts

Tuesday, 26 June 2018

నూతన్ నాయుడు ‘బిగ్’ మిస్టేక్..!

June 26, 2018 12
తెలుగు టీవీ మీడియాలోనే బిగ్ ఎంటర్టైనింగ్ షో గా మారిన బిగ్ బాస్ 2 ఒక బిగ్ మిస్టేక్ చేసిందా? సెలబ్రిటీల తో పాటు కామన్ మెన్ కూడా పాల్గొంటాడని బిగ్ బాస్ ఇచ్చిన అవకాశం వివాదంగా మారి ఇప్పుడు బిగ్ బాస్ మెడకే చుట్టుకుంటుందా? వరుసగా ఇద్దరు సామాన్యులను బయటికి సాగనంపటంతో బిగ్ బాస్ మీద విమర్శల జడివాన మొదలైంది. సెలిబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా షో లో పాల్గొంటారని బిగ్ బాస్ చెప్పినపుడు చాలామంది సంతోషించారు. సామాన్యులకు కూడా ఛాన్స్ దొరికిందని ఆనంద పడ్డారు. కానీ ఆ ఆనందం మొదటి వారంలోనే ఆవిరి అయ్యింది.
హౌస్ లోకి ఎంటర్ కాగానే ఇద్దరు సామాన్యులను జైల్లో పెట్టటం, ఫస్ట్ ఎలిమినేషన్ తోనే సామాన్యురాలైన సంజనాని బయటకు పంపటం, వివాదాలకు తావిచ్చింది. హౌస్ లో గ్రూపులు కడుతున్న వాళ్ళని, న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్న వాళ్ళనీ వదిలేసి రెండోవారంలో రెండో సామాన్యుడు నూతన్ నాయుడిని హౌస్ నుండి బయటకు పంపటంతో బిగ్ బాస్ కామన్ మెన్ కి వ్యతిరేకం అనే వాదన బలపడింది.మూడో వారంలోనే మూడో కామన్ మెన్ గా ఉన్న గణేష్ చుట్టూ ఉచ్చు బిగుస్తూ ఉండటం ఈ వాదనకు మరింత బలం చేకూర్చుతుంది.
కామన్ మెన్ కి ఎంట్రీ ఇచ్చినట్టే ఇచ్చి, వెంట వెంటనే వాళ్ళను బయటకు పంపించటం, తద్వారా వివాదం సృష్టించి షో కి కావలసినంత పబ్లిసిటీ తెచ్చుకోవటం, ఇదే బిగ్ బాస్ టార్గెట్ అని, దాని కోసమే కామన్ మెన్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారని, తాము అనుకున్నట్టే షో కి రేటింగ్ పెరిగింది కాబట్టి బిగ్ బాస్ కి కామన్ మెన్ తో అవసరం తీరిపోయిందని చాలామంది విశ్లేషిస్తున్నారు. పరిస్థితులు, పరిణామాలూ చూస్తే ఇది కూడా నిజమే అనిపిస్తోంది.
కామన్ మెన్ కి అవకాశం ఇవ్వటమే బిగ్ బాస్ ఉద్దేశ్యం అయితే సామాన్యులకు, సెలబ్రిటీలకు సమాన అవకాశాలు ఇచ్చి ఉండాలి. సెలబ్రిటీలకు ఓటింగ్ లో సహజంగానే ఎడ్జ్ ఉంటుంది కాబట్టి సామాన్యులకు ఒకటి,రెండు వారాలు ఎలిమినేషన్ ప్రక్రియ నుండి మినహాయింపు ఇవ్వాలి. కానీ ఇవేమీ జరగలేదు. మొదటినుండీ సంజనా, నూతన్ నాయుడు మొత్తుకుంటున్నది కూడా ఇదే. పులికీ మేకకి పోటీ పెట్టి, దానితోపాటే ఓటింగ్ పెట్టి, గెలిచినవాళ్ళే విజేతలు అనటం బిగ్ బాస్ కి న్యాయం కాదు. ఇప్పటికైనా బిగ్ బాస్ తప్పు దిద్దుకోవాలని, సామాన్యులకు రీ ఎంట్రీ ఇవ్వాలని సామాన్యులందరూ కోరుకుంటున్నారు.
Read More

నూతన్ నాయుడి తప్పేంటి?

June 26, 2018 8
నూతన్ నాయుడి తప్పేంటి?

బిగ్ బాస్ షో చూసే ప్రతి ఒక్కరి మనసులో కదులుతున్న ప్రశ్న
లక్షలాది సామాన్యులు ముక్త కంఠంతో అడుగుతున్న ప్రశ్న
... నూతన్ నాయుడి తప్పేంటి?
ఎన్నో ఆశలతో, అంచనాలతో బిగ్ బాస్ లో అడుగు పెట్టిన నూతన్ నాయుడు
రెండవ వారంలోనే ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు?
ఎలిమినేషన్ కి బేస్ ఏంటి?
హౌస్ లో పెర్ఫార్మెన్సా? ప్రేక్షకుల ఓట్లా?
కౌశల్ కి ఓట్లు ఎక్కువ రావటం వల్ల నూతన్ ఎలిమినేట్ అయ్యాడని చెపుతున్నారు.
గణేష్ సంపాదిన్చుకున్నన్ని ఓట్లు కూడా నూతన్ తెచ్చుకోలేక పోయాడా?
ఈ ఎలిమినేషన్స్ ఓట్లు బేస్ చేసుకునే చేస్తున్నారా? ఇంకా ఏదైనా రాజకీయం ఉందా?
హౌస్ లో ఉన్న సెలబ్రిటీలు అందరినీ వదిలిపెట్టి
సామాన్యులను మాత్రమే టార్గెట్ చేయడానికి కారణాలేంటి?
సామాన్యులను సాగనంపటమే బిగ్ బాస్ ఉద్దేశమా?
సామాన్యులకు ఎంట్రీ ఇవ్వడం ఎందుకు? ఇలా రెండువారాల్లోనే
బయటకు గెంటేయడం ఎందుకు?
ఇలా ఎన్నో ప్రశ్నలు రెండు తెలుగు రాష్ట్రాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
పొద్దున లేస్తే హౌస్ మేట్స్ మీద కుట్ర రాజకీయాలు చేయడం
తిన్నది అరగక తిట్లదండకంతో న్యూసెన్స్ క్రియేట్ చేయటం
పనిగా పెట్టుకున్న కొద్దిమంది సోకాల్డ్ సెలబ్రిటీలు హౌస్ లో హ్యాపీ గా ఉన్నారు.
బిగ్ బాస్ అంటే కుట్రలకు, కుతంత్రాలకు నెలవు అనే ఫీలింగ్ ని
ప్రేక్షకులందరికీ క్రియేట్ చేయడమే కాదు మంచితనం, వ్యక్తిత్వం ఉన్న వాళ్ళను
కావాలనే టార్గెట్ చేసి ఎలిమినేషన్ జోన్ లోకి పంపిస్తున్నారు.
బిగ్ బాస్ ప్రోగ్రాం పర్పస్ ఏంటి? పనికిమాలిన వాళ్ళను తయారు చేయటమా?
సెన్సిటివిటీ, సెన్సిబిలిటి ఉన్న వాళ్ళు హౌస్ కి అవసరం లేదా?
సమర్ధవంతంగా ఆడుతున్న వాళ్ళని సిల్లీ కారణాలతోఎలిమినేషన్ కి నామినేట్ చేసి
వాళ్ళని ఓటింగ్ బరిలో నిలబెట్టటం
వాళ్ళకి సరిపోయినన్ని ఓట్లు రాలేదనే సాకుతో హౌస్ లోనుండి
బయటకు పంపడం ఎంతవరకూ సమంజసం?
నూతన్ నాయుడు ఎంటర్టైన్ చేస్తున్నాడు
సెన్సిబుల్ గా బిహేవ్ చేస్తున్నాడు
సెలబ్రిటీలకు పోటీ ఇస్తున్నాడు
అలాంటి నూతన్ నాయుడిని ఎలిమినేట్ చేయడం నిజంగా దారుణం.
బిగ్ బాస్ ఇప్పటి కైనా ఆత్మవిమర్శ చేసుకోవాలి.
వైల్డ్ కార్డ్ ఎంట్రీతో నూతన్ నాయుడికి ఇంకో అవకాశం ఇచ్చి
జరిగిన తప్పుని సరిదిద్దుతారని ఆశిద్దాం.
Read More

Post Top Ad