Chanu Tricks
June 26, 2018
12
తెలుగు టీవీ మీడియాలోనే బిగ్ ఎంటర్టైనింగ్ షో గా మారిన బిగ్ బాస్ 2 ఒక బిగ్ మిస్టేక్ చేసిందా? సెలబ్రిటీల తో పాటు కామన్ మెన్ కూడా పాల్గొంటాడని బిగ్ బాస్ ఇచ్చిన అవకాశం వివాదంగా మారి ఇప్పుడు బిగ్ బాస్ మెడకే చుట్టుకుంటుందా? వరుసగా ఇద్దరు సామాన్యులను బయటికి సాగనంపటంతో బిగ్ బాస్ మీద విమర్శల జడివాన మొదలైంది. సెలిబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా షో లో పాల్గొంటారని బిగ్ బాస్ చెప్పినపుడు చాలామంది సంతోషించారు. సామాన్యులకు కూడా ఛాన్స్ దొరికిందని ఆనంద పడ్డారు. కానీ ఆ ఆనందం మొదటి వారంలోనే ఆవిరి అయ్యింది.
హౌస్ లోకి ఎంటర్ కాగానే ఇద్దరు సామాన్యులను జైల్లో పెట్టటం, ఫస్ట్ ఎలిమినేషన్ తోనే సామాన్యురాలైన సంజనాని బయటకు పంపటం, వివాదాలకు తావిచ్చింది. హౌస్ లో గ్రూపులు కడుతున్న వాళ్ళని, న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్న వాళ్ళనీ వదిలేసి రెండోవారంలో రెండో సామాన్యుడు నూతన్ నాయుడిని హౌస్ నుండి బయటకు పంపటంతో బిగ్ బాస్ కామన్ మెన్ కి వ్యతిరేకం అనే వాదన బలపడింది.మూడో వారంలోనే మూడో కామన్ మెన్ గా ఉన్న గణేష్ చుట్టూ ఉచ్చు బిగుస్తూ ఉండటం ఈ వాదనకు మరింత బలం చేకూర్చుతుంది.
కామన్ మెన్ కి ఎంట్రీ ఇచ్చినట్టే ఇచ్చి, వెంట వెంటనే వాళ్ళను బయటకు పంపించటం, తద్వారా వివాదం సృష్టించి షో కి కావలసినంత పబ్లిసిటీ తెచ్చుకోవటం, ఇదే బిగ్ బాస్ టార్గెట్ అని, దాని కోసమే కామన్ మెన్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారని, తాము అనుకున్నట్టే షో కి రేటింగ్ పెరిగింది కాబట్టి బిగ్ బాస్ కి కామన్ మెన్ తో అవసరం తీరిపోయిందని చాలామంది విశ్లేషిస్తున్నారు. పరిస్థితులు, పరిణామాలూ చూస్తే ఇది కూడా నిజమే అనిపిస్తోంది.
కామన్ మెన్ కి అవకాశం ఇవ్వటమే బిగ్ బాస్ ఉద్దేశ్యం అయితే సామాన్యులకు, సెలబ్రిటీలకు సమాన అవకాశాలు ఇచ్చి ఉండాలి. సెలబ్రిటీలకు ఓటింగ్ లో సహజంగానే ఎడ్జ్ ఉంటుంది కాబట్టి సామాన్యులకు ఒకటి,రెండు వారాలు ఎలిమినేషన్ ప్రక్రియ నుండి మినహాయింపు ఇవ్వాలి. కానీ ఇవేమీ జరగలేదు. మొదటినుండీ సంజనా, నూతన్ నాయుడు మొత్తుకుంటున్నది కూడా ఇదే. పులికీ మేకకి పోటీ పెట్టి, దానితోపాటే ఓటింగ్ పెట్టి, గెలిచినవాళ్ళే విజేతలు అనటం బిగ్ బాస్ కి న్యాయం కాదు. ఇప్పటికైనా బిగ్ బాస్ తప్పు దిద్దుకోవాలని, సామాన్యులకు రీ ఎంట్రీ ఇవ్వాలని సామాన్యులందరూ కోరుకుంటున్నారు.